ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనాకు కళ్లెం.. ఒక్కొక్కరికి మాత్రమే అనుమతి

విశాఖ జిల్లా చోడవరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ఒక్కొక్కరిని మాత్రమే అనుమతిస్తున్నారు. గతేడాది కార్యాలయ అధికారులు కరోనా బారిన పడ్డారు.. ఈ సారి కరోనా సోకకుండా చర్యలు చేపట్టారు.

corona measures at chodvaram registrar office

author img

By

Published : Apr 24, 2021, 11:54 AM IST

కరోనా ఉగ్రరూపం దాల్చుతుండటంతో విశాఖ జిల్లా చోడవరంలో ప్రభుత్వ కార్యాలయాధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. అత్యవసర పనులు మినహా మిగిలిన వాటికి ప్రభుత్వ కార్యాలయాలకు రావద్దొంటూ ప్రజలకు వివరిస్తున్నారు. చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కువమంది లోనికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్కొక్కరిని మాత్రమే లోనికి రానిస్తున్నారు.

గతేడాది చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్​తో పాటు సిబ్బందికి కరోనా సోకింది. ఈ సారి కరోనా మహమ్మారి బారిన పడకుండా.. అధికారులు ప్రత్యేక స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి: తితిదేకు రూ.24 లక్షల బస్సును విరాళంగా ఇచ్చిన తమిళనాడు భక్తుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.