ETV Bharat / state

విశాఖలో విజృంభిస్తున్న కరోనా.. - విశాఖలో కరోనా కేసుల సంఖ్య

కరోనా పాజిటివ్ కేసులు విశాఖ జిల్లాలో విజృంభిస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఇళ్లకు వెళ్లే వారి కంటే.. కొత్తగా పెరుగుతున్న కేసులే ఎక్కువ ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 700 మందికి పైగా వైరస్​ బారిన పడ్డారు. రోజుకు 40కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కంటైన్​మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతోంది.

corona
corona
author img

By

Published : Jun 27, 2020, 10:48 PM IST

విశాఖ జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నగరంతోపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతంలోనూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. పోలీసు, వైద్య సిబ్బంది.. కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మధురవాడలోని సబ్ రిజిస్ట్రార్​కు పాజిటివ్ రావడంతో.. ఆ కార్యాలయాన్ని మూసివేశారు. జిల్లాలో ఇప్పటివరకు 713 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రోజూ 40కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్​డౌన్​ సడలింపుల వల్ల విశాఖకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు నమోదైన 713 కేసుల్లో 424 యాక్టివ్ కేసులు ఉండగా.. 284 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది.

విమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నబాధితులకు, వెంటిలేటర్ అవసరమున్నరోగులకు వైద్య సేవలందిస్తున్నారు. గీతం, గాయత్రి, ఛాతీ ఆసుపత్రులు జిల్లాలో కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నాయి.

ఇదీ చదవండి: ప్రేయసి మోసం చేసిందని...యువకుడు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.