ETV Bharat / state

మాడుగుల నియోజకవర్గంలో కొత్తగా 8 కరోనా కేసులు

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నియోజకవర్గంలోని మాడుగుల, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో 8 కేసులు నమోదయ్యాయి. మాడుగుల మండల కేంద్రం దేవరాపల్లిలో ముగ్గురికి, కె.కోటపాడు మండలంలో నలుగురికి కరోనా సోకింది.

మాడుగుల నియోజకవర్గంలో కొత్తగా 8 కరోనా కేసులు
మాడుగుల నియోజకవర్గంలో కొత్తగా 8 కరోనా కేసులు
author img

By

Published : Jul 23, 2020, 8:04 PM IST

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మాడుగుల, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని 8 కరోనా కేసులు నమోదయ్యాయి. మాడుగుల మండల కేంద్రం దేవరాపల్లి గ్రామ సచివాలయం సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. సదరు వ్యక్తి విశాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులకు కరోనా పాజిటివ్​గా తేలింది.

కె.కోటపాడు మండలంలోని ఆనందపురం, లంకవానిపాలెం గ్రామాల్లో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మాడుగుల మండలం ఘాటీరోడ్డు కూడలిలో ఓ కిరాణా దుకాణం యజమానికి కరోనాగా నిర్ధారణయ్యింది. మొత్తం మూడు మండలాల్లో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల నేపథ్యంలో.. పారిశుద్ధ్య సిబ్బంది నివారణ చర్యలు చేపట్టారు. బ్లీచింగ్, హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

ఇదీ చదవండి:

కొవాగ్జిన్ ప్రయోగానికి కేజీహెచ్​లో రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.