విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తి నివారణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకునే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దుకాణాలు తెరవడానికి మధ్యాహ్నం వరకే ఆదేశాలు ఇచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పురపాలక కమిషనర్ కృష్ణవేణి.. స్థానిక ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతితో సమావేశమయ్యారు. రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఈ ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
కరోనా వ్యాప్తి నివారణకు అధికారుల సన్నాహాలు - నర్సీపట్నంలో కరోనా కేసులు
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో కరోనా కేసులు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి. ఇందులో భాగంగా వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
![కరోనా వ్యాప్తి నివారణకు అధికారుల సన్నాహాలు corona cases increased Heavy in Narseepatnam vizag district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7948695-448-7948695-1594222603032.jpg?imwidth=3840)