ETV Bharat / state

అనుమతి లేకుండా వెళ్తున్న ప్రజలు... అప్రమత్తమైన పోలీసులు

విశాఖలో గ్యాస్ లీకేజీ ప్రమాదంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాలవారు తమ స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే విశాఖలో పలు ప్రాంతాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. అనుమతి లేకుండా పలువురు ఊళ్లకు వెళ్లడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.

corona cases in vishakapatnam
corona cases in vishakapatnam
author img

By

Published : May 8, 2020, 4:00 PM IST

Updated : May 8, 2020, 5:19 PM IST

విశాఖ జిల్లా గోపాలపట్నంలో గ్యాస్ లీకేజీతో అక్కడ నుంచి కొందరు గిరిజనులు ఘాట్ మార్గం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు తరలివస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు వాలంటీర్లకు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో చాలా ప్రాంతాలు రెడ్ జోన్లో ఉండడం వల్ల.. గ్యాస్ లీకేజీతో వారి స్వగ్రామాలకు వెళ్తున్నారు. వీరిని గుర్తించి ముందస్తుగా వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనుమానం ఉంటే వెంటనే క్వారెంటైన్​కు తరలించాలని పాడేరు ఎస్ఐ శ్రీనివాస్ ఆదేశించారు. రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఆయా గ్రామాల్లోకి వచ్చేవారిని పరిశీలించాలని సూచించారు.

ఇవీ చదవండి: మద్యం కొంటే వేలికి సిరా వేయించుకోవాల్సిందే!

Last Updated : May 8, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.