విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కే. కోటపాడులో 2, ఆర్లి, చౌడువాడలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండల కేంద్రం దేవరాపల్లిలో మరో 2 కేసులు వెలుగుచూశాయి. చాప కింద నీరులా వైరస్ వ్యాప్తి అధికమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్వీయ జాగ్రత్తలు కొనసాగించాలని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి...