ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో గల మాచ్ఖండ్లో ఇద్దరికి కరోన నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని లమతపుట్ బీడీఓ సౌమ్యసార్ధక్ మిశ్రా ధ్రువీకరించారు. మాచ్ ఖండ్ కు చెందిన ఒక కుటుంబం.. గంజాం ప్రాంతంలో వివాహ శుభకార్యానికి వెళ్లి వచ్చారు. విషయం తెలుసుకున్న అధఇకారులు.. వారికి వ్యాధి నిర్ధరణ పరీక్షలు జరిపారు. ఆ కుటుంబంలో ఇద్దరకి కరోన సోకినట్లు ఫలితం వచ్చిందన్నారు. వీరిద్దరినీ సోమవారం జయపురం కోవిడ్ ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మార్వో మానస్ రంజాన్ పట్నాయక్.. పోలీస్ అధికారి ప్రఫుల్ లక్రా... మాచ్ ఖండ్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతాన్ని శానిటైజేషన్ చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాధి లక్షణాల గురుంచి సర్వే చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: