ETV Bharat / state

నర్సీపట్నంలో పెరుగుతున్న కరోనా కేసులు - విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా.. కేవలం నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 160 కేసులు నమోదయ్యాయి.

corona cases are increasing in narsipatnam at vishaka
నర్సీపట్నంలో పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Aug 12, 2020, 10:07 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా.. సుమారు 250 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కేవలం నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 160 కేసులు నమోదు కాగా మిగతా కేసులు నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం తదితర ప్రాంతాల్లో నమోదయ్యాయి.

నర్సీపట్నంలో ఇప్పటికీ పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుండగా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట, నాతవరం మండలం ఎంబి పట్నం, మాకవరపాలెం మండలం పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ అమల్లో ఉన్నాయి. మరోపక్క నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రులు కరోనా పరీక్షల కోసం ఉపయోగించే పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పలువురు పెదవి విరుస్తున్నారు.

ఇదీ చదవండి:

'ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరగాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.