ETV Bharat / state

మాస్కులు ధరించకుంటే జరిమానా: సీపీ - vishakha cp latest news

కరోనా కేసులు పెరుగుతున్నందున వాహనదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విశాఖ పోలీస్​ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా అన్నారు. విశాఖ బీచ్ రోడ్డులో తనిఖీలు నిర్వహించిన ఆయన... మాస్కు ధరించని వారికి జరిమానా విధించారు.

vishakha cp
విశాఖ బీచ్ రోడ్డు కరోనా అవగాహన వార్తలు, విశాఖ నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తాజా వార్తలు
author img

By

Published : Mar 28, 2021, 7:12 AM IST

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున వాహనదారులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా అన్నారు. శనివారం సాయంత్రం ఆయన బీచ్‌ రోడ్డులో పర్యటించారు. మాస్క్‌ లేకుండా ప్రయాణిస్తే రూ. 100 జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు.

బీచ్‌రోడ్డులో హోలీ రంగులు వేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దిశ పోలీసులు యారాడ నుంచి రుషికొండ వరకు 23 వాహనాల ద్వారా పర్యవేక్షణ చేస్తారన్నారు. నిఘా కోసం ద్విచక్ర వాహనాలు ప్రారంభించారు. డీసీపీలు, ఈడీసీపీ రజని, దిశా ఏసీపీ ప్రేమ్‌కాజల్‌, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఏయూలో కరోనా కలవరం... జిల్లా యంత్రాంగం అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.