విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వందలకు చేరువవుతోంది. ఆదివారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 85కి చేరింది. నగరంలోని దండుబజార్ ప్రాంతంలో దాదాపు 30 వరకు కేసులు రాగా.. పాతనగరంలో మరో 15 కేసుల వరకు వచ్చాయి. మహానగర పాలక సంస్థ పరిధిలోని అనకాపల్లిలో కూడా 20కి పైనే కేసులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతంలోని సబ్బవరం, దిబ్బపాలెం వంటి ప్రాంతాల నుంచి కొత్త కేసులు ఒక్కొక్కటిగా నమోదయ్యాయి.
లాక్డౌన్ 5.0లో ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా జగదాంబ జంక్షన్లో కొద్దిరోజులు పెద్ద వస్త్ర దుకాణాలు తెరచుకోగా జనం రద్దీ బాగా పెరిగింది. ఈక్రమంలో రాకపోకలు ముమ్మరమయ్యాయి. దండుబజార్, మహారాణిపేట, పూర్ణామార్కెట్ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. జీవీఎంసీ అధికారులు పూర్తిగా లాక్డౌన్ విధించారు. ప్రధాన మార్గంలో ఎక్కడా దుకాణాలు తెరవకుండా ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఈ మార్గంలో రాకపోకలను నియంత్రించారు.
ఇదీ చదవండి..