ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. విశాఖ మన్యంలో అంబులెన్స్‌ల కొరత ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. కిలోమీటర్ల దూరం కాలినడకన డోలీల్లో రోగులను తరలించే దృశ్యాలు మనల్ని కలచివేస్తూనే ఉంటాయి. ఇలాంటి పద్దతిలో మార్పు తెచ్చేందుకు నడుం కట్టారు విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ. ఈయన చొరవతో మన్యానికి అంబులెన్స్‌లను ఇచ్చేందుకు ఒక కార్పొరేషన్ కంపెనీ ముందుకు వచ్చింది. సామాజిక సేవా బాధ్యత కింద కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ రూ.3.4 కోట్ల వ్యయంతో 14 అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. పాడేరు జిల్లా ఆసుపత్రితో పాటు అరకు, చింతపల్లి, ముంచింగుపుట్‌లకు పెద్ద అంబులెన్స్‌లను, మిగతావి అంబులెన్స్‌లు లేని ఆసుపత్రులకు అందజేశారు.
ఇవీ చూడండి...