కోవిడ్ - 19 నియంత్రణ చర్యలపై చోడవరం మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సమీక్ష జరిగింది. నియోజకవర్గ ప్రత్యేక అధికారిణి సీతామహాలక్ష్మీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ… గ్రామాల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నవారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా... ఇంటివద్దే ఉండి చికిత్స పొందే కరోనా రోగులను ప్రతీరోజు పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. అందుకు తగ్గట్టుగా గ్రామాల్లో ఉండే ఆశా, ఏఎన్ఎంలు పని చేయాలని చెప్పారు.
ఇదీ చదవండి: