మహా శివరాత్రిని పురస్కరించుకొని విశాఖ ఆర్కెబీచ్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో .. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. శ్రీ లలితా కళా పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మ నందేంద్ర స్వామితో కలిసి ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణగా కోటినూట ఎనిమిది శివ లింగాలుతో నిర్మించిన మహా శివలింగానికి పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన 36 ఏళ్ల క్రితం.. ద్రాక్షారామంలో కుంభాభిషేకం చేశానని.. అనేక ఆటుపోట్ల తరువాత ఇక్కడ కోటిశివలింగాలకు కుంభాభిషేకం చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండీ.. శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు