ఉన్నత పర్వత శ్రేణి ప్రాంతానికి అనువుగా.. సంప్రదాయ పంటలతోపాటు అరుదైన విదేశీ పంటలపై పరిశోధనలు చేస్తూ, కొత్త వంగడాలను గిరిజన రైతులకు అందుబాటులోకి తీసుకువస్తూ మన్ననలు పొందుతుంది చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గిరిజన రైతుల లాభసాటి వ్యవసాయానికి, వారి ఆర్థిక ప్రగతికి నిరంతరం కృషి చేస్తుంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 37 గిరిజన మండలాల రైతులకు పంట సాగులో.. వివిధ రకాల సేవలు అందించడానికి వీలుగా 35 ఏళ్ల క్రితం 1985 ఫిబ్రవరి 26న వ్యవసాయ పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేశారు.
పరిశోధనా లక్ష్యాలు..
వ్యవసాయ దిగుబడుల పెంపొందించటం.. ఈ ప్రాంతానికి అనుకూలమైన మేలు జాతి వంగడాల ఎంపిక చేయటం.. పరిశోధన లక్ష్యాలుగా నిర్ణయించుకున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. రాజ్‌మా, వలిసె పంటలపై పరిశోధనలు చేయటం.. గిరిజన మండలాలకు అనువైన అత్యాధునిక సేద్యపద్ధతుల అభివృద్ధి.. మిశ్రమ పంటల సాగు, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహంతో పాటు అధిక ఆదాయమిచ్చే వాణిజ్య పంటల సాగుకు చేయూత లక్ష్యంగా పరిశోధనల చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
విశ్వవిద్యాలయం చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కిసాన్ మేళాను ఏర్పాటు చేశారు. ఉదయం క్షేత్ర సందర్శన, వ్యవసాయ ప్రదర్శన, క్విజ్, రైతు సదస్సు, స్టాళ్లు ప్రదర్శనలు.. మధ్యాహ్నం రైతులతో శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
ఇవీ చూడండి...