విశాఖ జిల్లా సింహాచలంలోని అడివివరంలోని మహాత్మా జ్యోతిబాపులే ఏపీ బీసీ గురుకులంలో పలు అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆదేశాల మేరకు సంబంధిత అధికారి విచారణ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాల, కళాశాల సీట్ల భర్తీ సమయంలో అప్పటి యాజమాన్యం కొందరు విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేశారని, పాఠశాల పరిసరాలు, డార్మెటరీ, భోజనశాలలను తమతోనే శుభ్రం చేయించేవారని, కొందరు కిందిస్థాయి సిబ్బంది రాత్రి వేళ విధులు నిర్వర్తించే సమయంలో మద్యం తాగేవారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు - నేడు పనుల్లోనూ అవి నీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయమై ప్రస్తుత ప్రిన్సి పల్ సత్యారావు వద్ద ప్రస్తావించగా.. రాష్ట్ర బీసీ గురుకులాల అకడమిక్ గైడెన్స్ అధికారి శ్రీనివాసాచార్యులు ఈ మేరకు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు
ఇదీ చదవండీ... amaravathi: ఏపీ రాజధానిగా 'అమరావతి' కేంద్రం గుర్తించలేదా?