విశాఖ జిల్లాలో బాబా అణువిద్యుత్ పరిశోధన కేంద్రం నిర్మాణంలో పరిహారం పంపిణీలో భారీ అక్రమాలు జరిగినట్టు బయటపడుతోంది. అచ్యుతాపురం మండల పరిధిలో బార్క్ నిర్మాణం కోసం 2011లో 436 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వ సర్వేలో 643 మంది రైతులు సాగులో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో జాబితాలోని పేర్లు కూడా మారిపోతున్నాయి. గత జాబితాలోని 512 మంది రైతులను తప్పించారు. 131మందే సాగులో ఉన్నట్టు కొత్త జాబితా సిద్ధం చేశారు.
బినామీలనే అనుమానం రాకుండా... ఆయా భూముల్లో రాత్రికి రాత్రే జీడి, మామిడి చెట్లు మొలింపించారు. చెట్లు ఉన్నాయని నమ్మించేందుకు జీడి, మామిడి కొమ్మలు తీసుకొచ్చి రాళ్ల సాయంతో పాతిపెట్టారు. మొక్కలున్నట్లు అధికారులను భ్రమింపజేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ జాబితాను సచివాలయ బోర్డులో అతికించారు. అప్పుడు గాని అసలు మోసం ప్రజలు గ్రహించలేకపోయారు. అర్హుల పేర్లు తొలగించి.. అనర్హుల పేర్లు చేర్చారంటూ గ్రామంలో సమావేశం నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ జాబితాలో కార్యాలయం ముద్ర లేకుండానే ప్రచురించారు. ఇందులో బినామీ పేర్లే ఎక్కువగా ఉన్నాయని, అసలైన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై అనకాపల్లి ఆర్టీవో సీతారామారావు వద్ద ప్రస్తావించగా.. విచారణ జరిపి అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి...