ETV Bharat / state

ఎల్జీ పాలిమర్స్ ఘటన: అస్వస్థతకు గురైన బాధితులకు పరిహారం - వైజాగ్ గ్యాస్ లీక్ వార్తలు

ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. ఎల్​జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు పూర్తి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

full compensation for vizag gas leak victims
స్టైరీన్‌ బాధితులకు పరిహారం
author img

By

Published : Jun 20, 2020, 8:01 AM IST

విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరీన్‌ లీకైన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులకు మిగిలిన పరిహారాన్ని అధికారులు అందిస్తున్నారు. లక్ష రూపాయల పరిహారం ఇవ్వాల్సిన బాధితుల్లో కొంతమందికి 75 వేల రూపాయలే ఇచ్చారని, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి అసలు ఇవ్వలేదని ఈ నెల 15న ‘పరిహారానికి ఎదురుచూపు’ శీర్షికన ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు.

75 వేల రూపాయలే అందుకున్నవారిలో ఇప్పటికి 10 మందికి మిగిలిన 25 వేల రూపాయలు చెల్లించారు.. మరికొందరికి నిధులు మంజూరయ్యాయని, రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తామని జిల్లా వైద్యశాఖాధికారి తిరుపతిరావు చెప్పారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది, పరిహారం అందని వారి నుంచి కలెక్టరు కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హత ఉన్నవారందరికీ పరిహారం ఇస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా విజృంభనతో మరింత అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.