విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో క్షతగాత్రులకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు చెక్కులను అందజేశారు.
మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున నలుగురికి అందజేశారు. 3 రోజుల క్రితం 8 మంది మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వగా.. నేడు మిగిలిన నలుగురికి ఇచ్చారు. కొంతమంది క్షతగాత్రులకు పాతికవేల రూపాయన చొప్పున పరిహారం చెల్లించారు.
ఇవీ చదవండి... 'వారిని తీసుకొచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేయండి'