ఇటీవల కురిసిన వర్షానికి జరిగిన పంట నష్టంపై వెంటనే నివేదికలు రూపొందించాలని వ్యవసాయ అధికారులకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సూచించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావుతో కలిసి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు యస్. రాయవరం మండలం సోముదేవుపల్లి వద్ద వరహా నదిలో వరద తాకిడికి కొట్టుకుపోయిన రహదారిని పరిశీలించారు. తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షలో ఆయన పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల భవనాలు, ఆర్బీకే కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని.. వచ్చే జనవరికి ప్రారంభించాలని ఆదేశించారు. సచివాలయాల్లో అన్ని సేవాలు అందించాలని తెలిపారు.
ఇదీ చూడండి:
తితిదే నిధులతో బాండ్ల కొనుగోలుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం