రాష్ట్రస్ధాయిలో ఓటర్ల జాబితా, సవరణ వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం మంచి పనితీరు కనబర్చడం వల్లే ఎన్నికల సంఘం ఇచ్చే ఈ గౌరవం పొందగలిగామని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన జిల్లాలకు ఎన్నికల సంఘం నుంచి ఇచ్చే పురస్కారానికి జిల్లా ఎంపికైంది.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాలో జరిగిన ఓటర్ల జాబితా, ఇతర అంశాలపై పనితీరును ఎన్నికల సంఘం మదింపు చేసి ఈ పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈనెల 25న రాజ్ భవన్లో జరిగే కార్యక్రమంలో జిల్లా తరఫున ఈ పురస్కారం అందుకోనున్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
ఇదీ చదవండి: