ETV Bharat / state

రాష్ట్ర అతిథిగృహానికి కేటాయించిన స్థలం పరిశీలన - విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్

రాష్ట్ర అతిథిగృహం కోసం విశాఖ జిల్లా కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ కొండపై కేటాయించిన స్థలాన్ని.. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పరిశీలించినట్లు సమాచారం.

cm secretary praveen prakash visits the land allotted for construction of state guest house in vishakapatnam
రాష్ట్ర అతిథిగృహానికి కేటాయించిన స్థలం పరిశీలన
author img

By

Published : Nov 10, 2020, 11:59 AM IST

Updated : Nov 10, 2020, 12:07 PM IST

విశాఖ జిల్లా కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ కొండపై 30 ఎకరాల్లో రాష్ట్ర అతిథిగృహం కోసం కేటాయించిన స్థలాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పరిశీలించినట్లు సమాచారం. నవంబర్ 9న సాయంత్రం ఆరున్నర గంటలకు విశాఖకు చేరుకున్న ఆయన... పలువురు అధికారులతో విమానాశ్రయంలో కొద్దిసేపు సమావేశమై నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది.

రాష్ట్ర అతిథిగృహ నిర్మాణ స్థలంలో ప్రస్తుతం పనులు ఏవిధంగా సాగుతున్నాయో పరిశీలించి.. వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులతో కలిసి వెళ్లిన ఆయన... లెవెలింగ్‌ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అతిథిగృహ ఆకృతులు, నిర్మాణవ్యయం ప్రతిపాదనలు ఎంతవరకు వచ్చాయో ఆరాతీశారు. ఈ ప్రాజెక్టు బృహత్తర ప్రణాళికపై సమీక్షించి పనులు వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయి పరిశీలనంతా రాత్రి సమయంలో అత్యంత గోప్యంగా జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

విశాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పర్యటన

Last Updated : Nov 10, 2020, 12:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.