CM residence on Rushikonda: విశాఖ నుంచి పాలనకు సిద్ధమవుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ కోసం.. రుషికొండపైనే నివాసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీచ్ వైపు నిర్మిస్తున్న విజయనగర బ్లాక్‌ను సీఎం నివాసంగా ఉపయోగిస్తారని.. బీచ్‌లో హెలిప్యాడ్ నుంచి నివాసానికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారని.. ప్రచారం సాగుతోంది. కళింగ బ్లాక్‌ను సీఎంఓ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. కళింగ, వేంగి బ్లాకులు దాదాపు సిద్ధంకాగా.. రుషికొండను చుట్టూ పోలీసులను భారీగా మోహరించారు.
Construction of Wall Around Rushikonda : నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రుషికొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం..
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో చట్టాల్ని ధిక్కరించి.. దొడ్డిదారిన విశాఖకు రాజధానిని తరలించేందుకు.. జగన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ఆ దిశగానే అధికార యంత్రాంగం వేగంగా పనులు చేస్తోంది. రుషికొండపై 4 బ్లాకుల్లో 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడే సీఎం నివాసం, కార్యాలయం ఉంటాయని.. సీఎం కుటుంబంతో ఉండేందుకు విజయనగర బ్లాక్‌ను.. సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ బ్లాక్‌ను 5,828 చదరపు మీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించగా, ఇప్పుడు 3,764 చదరపు మీటర్లకు కుదించారు. సముద్రానికి అభిముఖంగా ఉన్న... ఈ భవనం నుంచి సాగర అందాలు... ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇందులోనే ప్రెసిడెన్షియల్ సూట్ గదులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం.... కళింగ బ్లాక్‌ను వినియోగిస్తారని సమాచారం. తొలుత 5,753 చదరపు మీటర్లలో కళింగ బ్లాక్ నిర్మించాలని.. నిర్ణయించినా ఇప్పుడు 7266 చదరపు మీటర్లకు పెంచారు. 1,821.12 చ.మీ.లతో వేంగి బ్లాకును.. సిద్ధం చేయగా..690.40 చ.మీ.లలో నిర్మిస్తున్న గజపతి బ్లాక్ పనులు... చివరిదశలో ఉన్నాయి.
ముఖ్యమంత్రి నేరుగా విమానాశ్రయంనుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్... ఉపయోగిస్తారనే ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో హెలీ టూరిజం కోసం.. హెలిప్యాడ్ నిర్మించారు. అక్కడి నుంచి నేరుగా రుషికొండకు చేరుకునేలా ఇప్పటికే ఒక మార్గాన్ని కొండవెనుక నుంచి ఏర్పాటు చేస్తున్నారు. రుషికొండ చుట్టూ 3 చెక్‌పోస్టులు పెట్టి 24 గంటలు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కొండ వద్ద విశాఖ- భీమిలి బీచ్ రోడ్డు వైపు రెండు... కొండ వెనుక సముద్ర తీరంలో ఒక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి.. అటుగా ఎవరూ రాకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. కొండకు సమీపంలోకి ఎవరెళ్లినా వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. ఫొటోలు తీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఫోన్లు లాక్కుని వాటిని తొలగిస్తున్నారు. అటుగా నడిచి వెళుతున్న వారినీ.. కొన్నిసార్లు విచారిస్తున్నారు. సీఎం రాకముందే ఆంక్షలు ఇలాఉంటే.. వస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ మార్గంలో పోలీసుల ఆంక్షలు, రుషికొండ బీచ్ వైపు..... కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటు చేయడం పర్యాటకులను కలవరపాటుకు గురిచేస్తోంది.