CM Jagan Tour Restrictions: విశాఖలో సీఎం జగన్ పర్యటన అంటే నగరవాసులు భయపడుతున్నారు. శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొనడానికి సీఎం జగన్ ఈ నెల 28న శారద పీఠానికి వస్తున్నారు. స్థానిక బీఆర్ టీఎస్ రోడ్డు నుంచి శారదాపీఠానికి వెళ్లే కిలోమీటర్ పరిధిలోని దుకాణాలను పోలీసులు భద్రత కారణాలతో మూసివేయించారు. ఏమైనా అడిగితే ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా భద్రత ఏర్పాట్లు పాటించాలని, దుకాణాల తెరవొద్దని అధికారులు చెప్పారంటూ చిరువ్యాపారులు వాపోయారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు చూసే అధికారులు నోటి మాట ద్వారా సీఎం జగన్ శారదా పీఠంలో కార్యక్రమాలు ముగిసే వరకు దుకాణాలు తెరవద్దని చేప్పేశారు. ఫలితంగా దుకాణాలు తెరవకుండా సీఎం పర్యటన ఎప్పుడు ముగుస్తుందా అని చిరు వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.
"20 సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతున్నాం. మాకు ఈ దుకాణాలే ఆధారం. ఉద్యోగాలు, వాళ్ల లాగా ఆస్తులు పాస్తులు లేవు. ప్రతీ నెలా అన్ని రకాల పన్నులు కడుతున్నాం.. చెత్త పన్నుతో సైతం కడుతున్నాం. దుకాణాల నుంటి వచ్చే డబ్బుతోనే కదా కడుతున్నాం. పొమ్మంటే ఎక్కడికి పోతాం." -చిరు వ్యాపారి
"ఆటో ఢీకొని మా ఆయన చనిపోయాడు. కూరగాయలు అమ్ముకుని బతకొద్దా? షాపులు మూసివేయాలని చెప్పారు. మాకు భయమేసి షాపులు మూసి బయట కూర్చున్నాం. 3 రోజుల పాటు షాపుల మూసేయాలి. రోడ్డు వెంబడి ఎవ్వరూ నడవద్దంటే ఎలా?" -చిరు వ్యాపారి
ఇవీ చదవండి