ETV Bharat / state

CM Jagan Does Not Care SC&ST Youth Employment: కళాశాలలో నైపుణ్యాల కొరత.. ప్రశ్నార్థకంగా యువత భవిష్యత్ - ఎస్సీ ఎస్టీలపై ప్రేమ ఒలకబోసే సీఎం జగన్‌

CM Jagan Does Not Care SC&ST Youth Employment : ప్రతి సభలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ప్రేమ ఒలకబోసే సీఎం జగన్‌.. ఆ వర్గాలకు చెందిన యువత ఉపాధిని పట్టించుకోవడం లేదు. చదువుతో పాటే నైపుణ్యాలు అందించి, ఉపాధి కల్పిస్తామని ఘనంగా ప్రకటించిన జగన్‌.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలోని ముఖ్యమైన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివిన ఎస్సీ, ఎస్టీలకు లభిస్తున్న ప్రాంగణ నియామకాలు 30 నుంచి 40 శాతం మధ్యనే ఉంటున్నాయి. పేరున్న కళాశాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాటిలో చదివే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

CM_Jagan_Does_Not_Care_SC_ST_Youth_Employment

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 1:33 PM IST

CM Jagan Does Not Care SC&ST Youth Employment: కళాశాలలో నైపుణ్యాల కొరత.. యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం

CM Jagan Does Not Care SC&ST Youth Employment : ప్రతి సమావేశంలోనూ ఎస్సీ, ఎస్టీ లపై తనకే పేటెంట్‌ ఉ‌న్నట్లు చెప్పే సీఎం జగన్.. వారి ఉద్యోగావకాశాలను గాలికి వదిలేశారు. కోర్‌ ఇంజినీరింగ్‌ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ చదివే ఎస్సీ, ఎస్టీల్లో 15 నుంచి 20 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు లేకపోవడంతో అక్కడా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. కళాశాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఒక్కో విద్యార్థి 50 వేలు ఖర్చు చేసి, కొత్తగా కోర్సులు నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ వ్యయాన్ని భరించలేని ఎస్సీ, ఎస్టీలు నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. చిన్నచిన్న పనులు, ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Technical Skill Development University in Vizag Jagan Skips Assurance : ఆధునిక సాంకేతిక నైపుణ్యాల కోసం విశాఖపట్నంలో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్‌.. ఆ హామీని అటకెక్కించారు. నైపుణ్య కళాశాలలకు ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేయకుండా ఉన్న వాటిల్లోనే సర్దుబాటు చేసి, కోర్సులను పరిమితం చేసేశారు.

నిర్వహణకు నిధులు లేక.. కేంద్ర ప్రభుత్వ పథకం దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్‌ యోజన కింద వాటిని నిర్వహిస్తున్నారు. నైపుణ్యాల కొరత కారణంగా కళాశాలలో ఉద్యోగాలు లభించని వారికి పరీక్షలు పెడితే ఎలా ఎంపికవుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు నిధులు ఇవ్వకపోవడంతో కార్యకలాపాలు తగ్గిపోయాయి.

AP Medical seats for sale ఏడాదిలో 694 ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధుల సీట్లను అమ్మేస్తారా ! ఇదేనా బడుగు బలహీనవర్గాలపై ప్రేమ.
CM Jagan Cheated Students : విజయవాడకు సమీపంలోని ఓ ఎటానమస్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో ఏడాదిలో 700 మంది ఉంటే 501 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఓసీ, బీసీ, ఇతరులకు కలిపి 60 శాతం నియామకాలు వస్తే.. ఎస్సీ విద్యార్థులకు 41శాతం, ఎస్టీలకు 35 శాతం నియామకాలు వచ్చాయి. దాదాపుగా అన్ని కళాశాలల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. విజయనగరం జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో CSE చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఏడుగురు ఉంటే వీరిలో ముగ్గురు ఉత్తీర్ణులయ్యారు. వారిలో ఒక్కరికే ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగం లభించింది.

విశాఖపట్నంలోని ప్రముఖ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎస్సీ విద్యార్థులు 149 మంది ఉంటే.. వీరిలో 127 మంది ఉత్తీర్ణులు కాగా.. 58 మందికే ఉద్యోగాలు వచ్చాయి. గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో 26 మంది ఎస్సీలు ఉండగా.. 11 మంది మాత్రమే కోర్సు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలోని ప్రైవేటు కళాశాలలో 82 మంది ఎస్సీ విద్యార్థులు ఉంటే 40 మంది బీటెక్‌ పూర్తిచేశారు. ప్రభుత్వం మాత్రం వీరిని పట్టించుకోకుండా ఎస్సీ, ఎస్టీలకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.

CM Jagan cheating SCs: 'మీరెలా దళిత బంధువు జగన్..?' ఎస్సీల పథకాలకు పాతర.. నాలుగేళ్లలో ఒక్క కుటుంబానికీ దక్కని లబ్ధి

బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం లభించకపోతే ఎంటెక్, ఇతర పీజీ కోర్సులను ప్రైవేటు కళాశాలల్లో చేసేందుకు ఎస్సీ, ఎస్టీలకు అవకాశం లేకుండా పోయింది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ప్రభుత్వం బోధన రుసుముల చెల్లింపు నిలిపివేసింది. సీట్లు, విద్యార్థులు కోరుకునే కోర్సులు ఎక్కువగా ప్రైవేటులోనే ఉన్నాయి. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో ప్రైవేటులో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీలు అప్పులు చేసి, ఫీజులు కట్టుకోవాల్సి వస్తోంది.

Jagan cheated students నయవంచనగా విదేశీ విద్యా దీవెన.. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసిన జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.