CM Jagan Cheated Fishermen: సీఎం జగన్ మాట తప్పడు, మడమ తిప్పడని వైసీపీ శ్రేణులు.. గొప్పలు రివర్సయ్యాయి. పూడిమడక మత్స్యకారులకు.. విపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీ అంశంలో జగన్ మడమ తిప్పేశారు. నాలుగేళ్లుగా వారికి పరిహారం ఇవ్వకపోవడంతో.. విసిగిన సొంత పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి.
"సెజ్ దగ్గర్నుంచి సముద్రంలోకి ఏర్పాటు చేస్తున్న ఏపీఐఐసీ పైపులైను కోసం టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏపాటిది.? మేము అధికారంలోకి వస్తే సెజ్‌లోని పరిశ్రమల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తాం. మాకు మద్దతుగా నిలవండి. మీ జీవితాలను మార్చేస్తాం." ఇవి 2018 ఆగస్టు నెలాఖరున ప్రతిపక్షనేతగా నిర్వహించిన పాదయాత్రలో అచ్యుతాపురం పూడిమడక మత్స్యకార సంఘ నాయకులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఇది.
ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు దాటిన బోడు మల్లన్నఅన్న చందంగా మత్స్యకారుల్ని సీఎం జగన్ముం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగపుత్రులకు ఇచ్చిన ప్యాకేజీ, ఉద్యోగ హామీని గంగలోనే కలిపేశారు. నాడు ఎన్నికల్లో లబ్ధి కోసం నెత్తిపై తాటాకు టోపీ, వల చేతపట్టుకుని తనదైన శైలిలో నవ్వుతూ, ముద్దులు పెడుతూ పూడిమడక మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు నింపుతానని ఉత్త మాటలు పలికారు.
ప్రకటనలకే పరిమితమైన జగన్ మాటలు.. ఇప్పటికీ ట్రిపుల్‌ఐటీలకు నో వీసీ
ఎన్నికల ప్రచార సభల్లో ఆపార్టీ ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుడివాడ అమర్నాథ్.. జగన్ ఇచ్చిన హామీనే పునరుద్ఘాటిస్తూ వచ్చారు. ఇదంతా నిజమని నమ్మిన మత్స్యకారులు పూడిమడకలో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. తీరా గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీని పక్కన పెట్టేసింది.
నాలుగేళ్లుగా ఇదిగో అదిగో అంటూ నాన్చుతూ గంగపుత్రులను మోసగిస్తోంది. ఇంటికో ఉద్యోగం మాట అటుంచితే.. 5 లక్షల రూపాయల పరిహారం కూడా అందించలేకపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అచ్యుతాపురం సెజ్‌లోని రసాయన పరిశ్రమల వ్యర్థాలను శుద్ధిచేసి పూడిమడక తీరంలో వదిలేందుకు ఏపీఐఐసీ ద్వారా పైపులైను నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు.
ASHOK BABU ON CM JAGAN: 'హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారు..'
"టీడీపీ హయంలో సుమారు నాలుగు వేల మంది లబ్దిదారులకు.. ప్యాకేజీ అమలు చేశారు. వైసీపీ నేతలు వచ్చి టీడీపీ మీకు దగా చేస్తోంది.. కేవలం 1లక్ష 25వేలు మాత్రమే ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఐదు లక్షల రూపాయల ప్యాకేజీతో పాటు.. ఇంటికో ఉద్యోగమని హామీ ఇచ్చారు." -మత్య్సకారుడు
"అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్యాకేజీ అందించలేదు. అధికార పార్టీకి చెందిన సర్పంచే.. ఇంకా ప్యాకేజీలు అందలేదని ఉన్నాతాధికారులకు అర్జీలు ఇస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఇలా అయితే మత్య్సకారులు ఎవర్ని అడగాలో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది." -మత్య్సకారుడు
జగన్ హామీలు తేనెపూసిన కత్తి వంటివి: దివ్యవాణి
పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయడం వల్ల.. ఉపాధి కోల్పోతామని అప్పట్లో మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారితో పలు దఫాలు అధికారులు చర్చలు జరిపిన తర్వాత ఆ గ్రామంలో మత్స్యకారులకు ఒక్కొక్కరికి లక్ష 25వేల రూపాయల చొప్పున పరిహారం అందించేందుకు ముందుకొచ్చారు. కొంతమంది పరిహారం తీసుకున్నారు.
అయితే ఈ ప్యాకేజీ సరిపోదని 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కొక్కరికి.. 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని వైసీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. వైసీపీ నాయకులు నిర్వహించిన ఆందోళనకు ఆ పార్టీ అధినేత జగన్‌తో పాటు ముఖ్య నేతలు అప్పట్లో మద్దతు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు మెరుగైన ప్యాకేజీ అందించడంతో పాటు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించి ఆదుకుంటామని బహిరంగంగా హామీ ఇచ్చారు. వైసీపీ మాటలు నమ్మి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని అప్పట్లో చాలామంది తీసుకోలేదు. అధికారం చేతికి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడిచిన ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు.
Pulses Cultivation Reduced in AP: నీటిమీద రాతలుగానే జగన్ హామీలు.. ‘చిరు’సాయమూ కరవే!
వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా హామీని నిలబెట్టుకోక పోవడంతో గంగపుత్రులు మండిపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేను సొంత పార్టీ శ్రేణులే అడ్డుకున్నారు. పరిహారం సంగతి తేల్చాలంటూ ప్లకార్డులు చూపి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సెజ్ వ్యర్థాలు సముద్రంలోకి విడిచిపెట్టడంతో మత్స్య సంపద తగ్గిపోతోందని.. మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇక్కడి మత్స్యకారులు పూడిమడకను వీడి విశాఖ, కాకినాడ, ఒడిశా ప్రాంతాలకు వలస పోతున్నారు.
Jagan promises: మాటలకే పరిమితం.. నాలుగేళ్లయినా మొదలు కాని కాలువ పనులు