CM Jagan Mohan Reddy Administration from Visakhapatnam: సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారనేది ప్రచారానికే పరిమితమైంది. సంక్రాంతి.. ఉగాది నాటికల్లా విశాఖకు మకాం మారుస్తారని చెప్పిన వైసీపీ మంత్రులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ రాజధానిగా కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. అందరూ అనుకున్న సమయానికంటే ముందే సీఎం విశాఖ వస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్.. జీఐఎస్ సదస్సు ముగింపు సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ, నెలలు గడుస్తున్నా.. సీఎం విశాఖకు మకాం మార్చడం ప్రశ్నార్థకంగానే మిగిలింది.
విశాఖ రాజధాని కాబోతోంది.. నేను కూడా విశాఖకు షిఫ్ట్ కాబోతున్నా: సీఎం జగన్
Capital visakha విశాఖ నుంచి పాలన సాగించే అంశంపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. సెప్టెంబరు మాసం నుంచే అక్కడికి కాపురం మారుస్తానంటూ సీఎం జగన్ ఇటీవల చేసిన ప్రకటన అనంతరం తాజాగా వైసీపీ నేతలు దసరా నాటికి పాలన విశాఖకు మారుతుందని చేస్తున్న వ్యాఖ్యలపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విశాఖలో సీఎం కార్యాలయం, నివాసాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను తాజాగా పోలీసు విభాగం సమీక్షించినట్టు తెలుస్తోంది. రుషికొండలో పర్యాటక శాఖ కొత్తగా నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం అక్కడికి సమీపంలోనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన మరో భవనంలో సీఎం నివాసానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చినట్టు సమాచారం.
ప్రజల దృష్టిని మరల్చేందుకే.. సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన: టీడీపీ
Department of Tourism buildings on Rushikonda ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ నుంచి పాలన సాగించే అంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అక్టోబరు నెలలో దసరా పండుగ నుంచి ఆయన విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అక్టోబరు 24 తేదీన సీఎం అక్కడి నుంచే పాలన సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రుషికొండపై పర్యాటక శాఖ పేరుతో నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం, అలాగే అక్కడికి సమీపంలోనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన మరో భవనంలో ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రుషికొండను తొలిచి నూతనంగా నిర్మించిన పర్యాటక శాఖ భవనాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుగుణంగా తీర్చిదిద్ది భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
స్థానిక విశాఖ పోలీసులు, సీఎం సెక్యూరిటీ వింగ్ కు చెందిన అధికారులు రుషికొండ వద్ద భద్రతను కూడా సమీక్షించినట్టు తెలుస్తోంది. అటు సీఎం సతీమణి భారతి కూడా సీఎం నివాసానికి సంబంధించిన స్వయంగా వెళ్లి పరిశీలించినట్టు సమాచారం. సెప్టెంబరు నెల నుంచే విశాఖకు కాపురం మారుస్తానని గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లే అంశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు రుషికొండ వద్ద ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా చేసిన నిర్మాణాలు పోలీసుల భద్రతా ఏర్పాట్లు ఈ అనుమానాలకు ఊతమిస్తున్నాయి. మరోవైపు సెప్టెంబరు నెలలోనే అక్కడికి కాపురం మారుస్తానని ప్రకటించినా.. వైసీపీకి చెందిన కొందరు నేతలు మాత్రం అక్టోబరులో దసరా పండుగ నుంచి ఆయన విశాఖకు మారతారని ప్రకటించటంపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.