ETV Bharat / state

విత్తనాల పంపిణీలో పోలీసులతో వాగ్వాదం

విశాఖ జిల్లా ఎం. ఆలమండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి విత్తనాలు తక్కువగా రావడంపై రైతుల్లో పెల్లుబికింది. ఈ క్రమంలో వరుసలో ఉన్నవారు కాకుండా పక్కనుంచి వచ్చిన వారికి విత్తనాలు అందించారంటూ... పోలీసలుకు రైతలకు మధ్య వాగ్వాదం జరిగింది.

విత్తనాల పంపిణిలో పోలీసులతో వాగ్వివాదం
author img

By

Published : Jun 24, 2019, 8:42 PM IST

విత్తనాల పంపిణిలో పోలీసులతో వాగ్వివాదం

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఎం.అలమండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో రాయితీ విత్తనాల పంపిణీలో గందరగోళం తలెత్తింది. విత్తనాలు పొందడానికి మండలంలోని పలు ప్రాంతాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. తోపులాట జరిగింది. వరుసలో ఉన్న వారికి కాకుండా పక్కనుంచి వచ్చిన వారికి విత్తనాలు అందించారంటూ రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సక్రమంగా విత్తనాలు అందజేస్తామని పోలీసులు హామీ ఇచ్చాకే ఘర్షణ అదుపులోకి వచ్చింది. అయితే... విత్తనాలు చాలా తక్కువగా వచ్చాయని, అవసరమైనంతగా అందించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ :

సీఎం ఇంటి నీటి బిల్లు బకాయి రూ. 7లక్షలు!

Intro:AP_GNT_26_24_MUNCIPAL_RAGADA_AV_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాభాసాగా సాగింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజల కోసం నిర్మించిన ఇళ్ల జాబితాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై వైకాపా కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. ఐదేళ్ల అధికారంలో ఉండి ఇళ్ల జాబితాను ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. తెదేపా హయాంలో రూపొందించిన ఇళ్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పారు. శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇళ్ల జాబితా రూపకల్పనలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని దీనిపై విచారణ చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని ఈ సమయంలో లో ఇళ్ల జాబితా ప్రకటించడం సబబు కాదని వైకాపా కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. కమిషనర్ శ్రీనివాసులు సైతం ఇదే అభిప్రాయాన్ని తెదేపా కౌన్సిలర్ లకు తెలియజేశారు. తమ ఐదేళ్ళ కాలం మరో తొమ్మిది రోజులలో పూర్తవుతుందని.... ఈ లోపు జాబితా ప్రకటించి ఎన్నికలకు వెళ్దామని తెదేపా నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన నా అధికారులు అభ్యంతరం చెప్పడంతో తెదేపా కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. చైర్మన్ గంజి చిరంజీవి రెండు రోజుల్లో ఇళ్ల జాబితాను ప్రకటించాలని అధికారులను ఆదేశించారు.

Body:viss

Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.