ETV Bharat / state

MINISTER AVANTHI : తాపీ మేస్త్రీ మృతి.. మంత్రి అవంతి ఇంటి ఎదుట ఆందోళన - vishaka road accident

విశాఖ జిల్లాలో నిన్న మంత్రి కాన్వాయ్‌లోని కారు ఢీకొని ఓ తాపీ మేస్త్రీ అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ.. మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇంటి వద్ద ధర్నాకు దిగారు.

citu-protest-infront-of-minister-avanthi-srinivas-house-at-vishaka
మంత్రి అవంతి ఇంటి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
author img

By

Published : Nov 10, 2021, 10:24 AM IST

Updated : Nov 10, 2021, 9:38 PM IST

మంత్రి అవంతి ఇంటి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

మంత్రి అవంతి కాన్వాయ్‌లోని కారు ఢీకొని మృతిచెందిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. విశాఖ జిల్లా సీతమ్మధారలో మంత్రి అవంతి శ్రీనివాసరావు.. ఇంటి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

నిన్న సీఎం పర్యటన సమయంలో విశాఖ బిర్లా కూడలి వద్ద మంత్రుల వాహన శ్రేణి ఢీకొని తాపీ పని చేసే సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాద ఘటన జరిగినా.. మంత్రి వాహన శ్రేణి కనీసం అపకుండా వెళ్లి పోవడం దారుణమని నినాదాలు చేశారు. స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు.. బంధువులు కార్మిక సంఘాలను పిలిచి చర్చలు జరిపారు. బంధువులు..కార్మిక సంఘాలు మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని, 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి: Maha Padayathra: తొమ్మిదో రోజు మహా పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం

Last Updated : Nov 10, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.