ఉత్తరాంధ్ర పరిధిలోని 3 జిల్లాలతో పాటు.. తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్దికి ప్రభుత్వంతో ఏ రకంగా కలసి పని చేయాలన్న అంశంపై సిఐఐ ప్రాంతీయ సమావేశం విశాఖలో జరిగింది. పరిశ్రమ, వాణిజ్య వర్గాలు ప్రభుత్వం నుంచి అశిస్తున్న సహకారంపై చర్చించారు. మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం పెరిగేట్టుగా ప్రోత్సహించాల్సిన అంశాలపై ప్రతినిధుల నుంచి ప్రతిపాదనలను స్వీకరించారు. సీఐఐ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షులు గల్లా విజయ నాయుడు, ఐటి, ఇన్ఫ్రా, నిర్మాణ రంగాల నుంచి ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
ఇవీ చూడండి: