త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో ధీటైన అభ్యర్థులను ఎంపిక చేయాలని.. వారిని చిత్తశుద్ధితో గెలిపించి సీఎం జగన్కు బహుమానంగా ఇవ్వాలని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా.. రోలుగుంట, రావికమతం మండల వైకాపా నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
చాలా చోట్ల పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతోందన్నారు. పార్టీ, రాజకీయాలకు అతీతంగా వైకాపా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను.. మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు గుర్తు చేశారు. అందుకు ఈ ఎన్నికల ప్రచారాన్ని వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలు...