ETV Bharat / state

ప్రాణాలు పోతున్నాయి... ర‌హ‌దారి నిర్మించండి మ‌హాప్ర‌భో!

త‌రాలు మారుతున్నాయి...సాంకేతిక విప్ల‌వం జోరందుకుంటుంది.... 5జీ యుగంలోకి వ‌స్తున్నాం... కానీ మా త‌ల‌రాత‌లు మాత్రం మార‌డంలేదంటూ మారుమూల ప్రాంతాల గిరిజ‌నులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఈ కోవ‌లోకి వస్తోంది విశాఖమన్యంలోని చింత‌ల‌పాడు గ్రామ‌స్థుల ఆవేదన.

Chintalapadu villagers in Visakhapatnam are facing severe difficulties due to lack of road facilities.
మట్టి రహదారి నిర్మిస్తున్న గ్రామస్థులు
author img

By

Published : Oct 10, 2020, 12:47 PM IST

విశాఖ మ‌న్యం చింతపల్లి మండలం కుడుముసారి గ్రామ పంచాయతీలోని చింతలపాడు గ్రామానికి ర‌హ‌దారి స‌దుపాయం లేకపోవటంతో...గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ర‌హ‌దారి స‌దుపాయం లేక‌పోవ‌డంతో... రోగుల‌ను త‌ప్ప‌నిస‌రి అనుకుంటే డోలీ మోత‌ల‌తో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఇటీవ‌ల కాలంలో అయిదుగురు గ‌ర్బిణీల‌ను స‌కాలంలో ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌లేక‌పోవ‌డంతో మృత్య‌వాత ప‌డ్డార‌ని స్థానికులు వాపోయారు. అధికారుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఎన్నిసార్లు విన్న‌వించినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.... ప్ర‌తీ ఏటా క‌నీసం కాలిబాట‌యినా ఉంచాల‌నే ఉద్దేశ్యంతో శ్ర‌మ‌దానంతో ర‌హ‌దారిని నిర్మిస్తున్నామ‌ని, గ‌ట్టిగా వ‌ర్షాలు ప‌డితే ఆ ర‌హ‌దారి మూసుకుపోతుంద‌ని గిరిజ‌నులు వాపోయారు. ఇందులో బాగంగా ఇటీవ‌ల కాలంలో మూసుకుపోయిన రోడ్డును శ్ర‌మ‌దానంతో ఒక రూపుకు తీసుకువ‌చ్చే ప‌నిలో ఉన్నామ‌ని, అధికారులు స్పందించి చింత‌ల‌పాడు గ్రామానికి ప‌క్కా ర‌హ‌దారి స‌దుపాయం క‌ల్పించాల‌ని గ్రామ‌స్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇరు వర్గాల మధ్య ఘర్షణ....వాలంటీర్​కు తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.