విశాఖ జిల్లా అనకాపల్లిలో.. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల వివరాలు పోలీసులు కనుగొన్నారు. చిన్నారులకు ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ఉన్నతాధికారులతో చర్చించారు. నర్సింగరావుపేటలో నివసిస్తున్న సౌజన్య.. గత నెల 29వ తేదీన కరోనాతో మృతి చెందారు. ఈమె భర్త నవీన్ కరోనాతో చికిత్స పొందుతూ ఈనెల 10న మృతి చెందారు. దీంతో వారి పిల్లలు శ్రీ మిదున్(9) , శ్రీ చందన(5) అనాథలుగా మిగిలారు. ప్రస్తుతం వీరు దొండపర్తిలోని పెదనాన్న ఇంటివద్ద ఉంటున్నారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి పట్టణ సీఐ భాస్కర రావు.. వారిని అనకాపల్లి రప్పించారు. చిన్నారులకు పునరావాసం కల్పిస్తామని అడగ్గా.. వారి పెదనాన్నతాను పిల్లల్ని చూసుకుంటామని తెలిపారు. ప్రభుత్వపరంగా చిన్నారులకు అందించాల్సిన సాయంపై జిల్లా ఎస్పీ కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లినట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: కూతురితో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య