నౌకాదళంలో కొత్తగా చేరిన యువతే లక్ష్యంగా పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ సంస్ధ హనీ ట్రాప్ చేస్తోందని... తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అన్నారు. హనీ ట్రాప్‌లో పడకుండా రక్షణదళాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని వివరించారు. ఫేస్బుక్లో నకిలీ ఖాతాలను సృష్టించి.. అమ్మాయిల ఫొటోలతో యువతను ఆకట్టుకుంటున్నారని.. వారి ద్వారా సమాచారం సేకరించేందుకు యత్నిస్తున్నారని అతుల్ కుమార్ తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, నేవీ పోలీసులు సంయుక్తంగా ఈ తరహా ట్రాప్‌లలో భాగస్వాములై సమాచారం అందించేవారిని గుర్తించారని వివరించారు. ఇప్పటికే ఏడుగురుని ఆరెస్ట్ చేసినట్లు తెలిపారు. రక్షణ దళాల యూనిట్లలో స్మార్ట్ ఫోన్లను నిషేధించడమే కాకుండా... ఇందులో పనిచేసే వారి సామాజిక మాధ్యమ అకౌంట్లపై నిషేధం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ లెక్కలనే మార్చేసినోళ్లు ఏమైనా చేయగలరు: చంద్రబాబు