ETV Bharat / state

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి భయానకం: చంద్రబాబు

author img

By

Published : Feb 28, 2020, 6:47 AM IST

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు ఎంత భయకరంగా ఉన్నాయో, విశాఖపట్నంలో జరిగిన ఘటన ద్వారా అర్థమవుతుందని చంద్రబాబు ట్వీట్ చేశారు.

cbn tweet on vizag incident
శాంతి భద్రతల పరిస్థితి భయానకం: చంద్రబాబు

పోలీసుల అనుమతి ఉన్నా ప్రజా చైతన్య యాత్రను అడ్డుకున్నారంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. తన పర్యటనను అడ్డుకునేందుకు ఇతర జిల్లాల నుంచి వైకాపా కార్యకర్తలను తరలించడం హేయమైన చర్య అని గురువారం ట్వీట్‌ చేశారు. ‘‘విశాఖ, విజయనగరంలో ప్రజా చైతన్యయాత్రకు అనుమతి అడిగితే మాకు సవాలక్ష ఆంక్షలు పెట్టిన పోలీసులు.. ఆందోళనకారుల ముసుగులో వచ్చిన వైకాపా కార్యకర్తలను వదిలేసి.. నన్ను అరెస్టు చేయడం సిగ్గు చేటు. ఇది ప్రభుత్వ, పోలీసు వ్యవస్థల వైఫల్యమే’’ అని పేర్కొన్నారు. ‘‘హుద్‌హుద్‌ బీభత్సంతో చెల్లాచెదురైన విశాఖ విమానాశ్రయాన్ని మేమే దగ్గరుండి పునర్నిర్మించాం..నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. అదే ఎయిర్‌పోర్టు వద్ద నన్ను అడ్డుకోవడం, గంటల తరబడి నిలిపేయడం విశాఖ వాసులు ఎవరూ చేయరు’’ అని వివరించారు.

cbn tweet on vizag incident
చంద్రబాబు ట్వీట్

ఇదీ చదవండి: షూట్ మీ.. ఎన్​కౌంటర్ చేయండి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.