ETV Bharat / state

'ఉక్కు పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం' - చంద్రబాబు ట్వీట్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయటం ప్రజలను మోసం చేయటమేనని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వంద రోజులుగా పోరాటం జరుగుతున్నా.. పార్లమెంట్​లో వైకాపా నేతలు ఒక్క మాట కూడా మాట్లడలేకపోయారని విమర్శించారు. పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా తెదేపా సిద్ధమని స్పష్టం చేశారు.

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : May 22, 2021, 1:47 PM IST

  • 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటై, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి దోహద పడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణకు తెలుగుదేశం ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంది(3/3)#100DaysOfVSPprotests

    — N Chandrababu Naidu (@ncbn) May 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్షలు జరుగుతుంటే పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడని వైకాపా... అసెంబ్లీలో తీర్మానం చేయటం ప్రజలను మోసం చేయడమేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా తెదేపా సిద్ధమని స్పష్టం చేశారు. కరోనా విపత్కర కాలంలో రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసిన విశాఖ ఉక్కు కర్మాగారం.. దేశానికే ఊపిరి పోసిందని కొనియాడారు.

"వెయ్యి పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చి ఎన్నో ప్రాణాలు విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుతోంది. అలాంటి విశాఖ ఉక్కును కబళించేందుకు కొందరు వైకాపా పెద్దలు కుట్రలు చేస్తున్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటై, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ... దేశ ఆర్థికాభివృద్ధికి దోహద పడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణకు తెదేపా ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది." -చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

వందో రోజుకు చేరిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.