ETV Bharat / state

ఈనెల 10, 11 తేదీల్లో చంద్రబాబు విశాఖ పర్యటన

ఈనెల 10, 11 తేదీల్లో తెదేపా అధినేత చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నట్లు ఆపార్టీ నేత నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖ పర్యటనకు చంద్రబాబు
author img

By

Published : Oct 6, 2019, 9:37 PM IST

విశాఖ పర్యటనకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10, 11 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖలో తెదేపా శ్రేణులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు చినరాజప్పతోపాటు చింతకాయల అయ్యనపాత్రుడు పాల్గొన్నారు. చినరాజప్ప మాట్లాడుతూ..అధినేత రెండు రోజులపాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్​పై ఇప్పటికే 13 కేసులు ఉన్నాయని...అందుకే మిగతావారిపై కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ్యులపై కేసులు పెడితే భయపడేది లేదని తెలియజేయటం కోసమే చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారని చినరాజప్ప స్పష్టం చేశారు.

రాష్ట్రంలో తుగ్లక్ పాలన
రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని...కేసులు పెట్టి అందరిని భయపెట్టాలని చూస్తున్నారని వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని వారికి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ఇదీచదవండి

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు ఓ బూటకం: వర్ల

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.