ఎల్జీ పాలిమర్స్‌కు వైకాపా ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదనడం అవాస్తవమని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో రాజకీయ లాభం పొందాలని చూడటం హేయంగా అభివర్ణించారు. జగన్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నామని తెలిపారు. తెదేపా హయాంలో ఎకరం భూమి కూడా ఎల్‌జీ పాలిమర్స్‌కు కేటాయించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మేం సమర్పించిన వివరాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. 1961 నుంచి 2020 వరకు ఈ కంపెనీ పూర్వాపరాలను ప్రజల దృష్టికి తెస్తున్నామని వివరాలను చంద్రబాబు వెల్లడించారు.
తెదేపా అధినేత చంద్రబాబు చెప్పిన వివరాలు..
- కంపెనీ వినియోగిస్తున్న 219 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది.
- 23.11.1964న అప్పటి ప్రభుత్వం ఎకరం రూ2,500 చొప్పున కేటాయించింది.
- అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపులను 8.10.1992న అప్పటి ప్రభుత్వం ఇచ్చింది.
- 8.5.2007న వైఎస్ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది.
- 1.9.2009న మరోసారి వైఎస్ ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది.
- కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 13.04.2012న, 06.05.2012న క్లియరెన్స్ ఇచ్చింది.
- వైఎస్ ప్రభుత్వం, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండేసి సార్లు అనుమతులిచ్చాయి.
- గత ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లను తెదేపా ప్రభుత్వం రెన్యూవల్ చేసింది.
- పాలిస్టైరీన్, ఉత్పత్తుల విస్తరణకు తెదేపా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
ఇదీ చదవండి: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఆందోళన