విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ కేసులో... సీబీఐ విచారణ నర్సీపట్నంలో రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి సిబ్బందిని విచారించగా... రెండో రోజు విచారణలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయంలో సిబ్బందిని విచారిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 6వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి వైద్యుడు సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై ఈ విచారణ కొనసాగుతోంది.
ఇదీ చదవండి