విశాఖ జిల్లా చోడవరం మండలం అడ్డూరులో బాలిబోయిన, బూర కుటుంబీకులు.. పొలాల వద్ద తాటాకు పాకలు వేసుకుని నివసిస్తున్నారు. ఆదివారం గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి వచ్చేసరికి వారి పాకలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో ఆరు గేదెలు, అయిదు గొర్రెలు, పది మేకలు సజీవ దహనమయ్యాయి. తమకు జీవనాధారం లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. చోడవరం, సబ్బవరం నుంచి అగ్ని మాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
ఇదీ చూడండి:
గంజాయి అక్రమరవాణాలో హోంగార్డు వక్రబుద్ధి...