అక్రమంగా భారీ మొత్తంలో నగదును హవాలా రూపంలో చలామణీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ద్వారకానగర్ లోని ఓ అపార్ట్మెంట్లో 38 లక్షల 76వేల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అందించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీచదవండి
రూ. 3లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం