విశాఖలోని హనుంతవాక కూడలిలో ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో కారులో ఉన్నవారు కిందకు దిగిపోవటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. అయితే ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కారు స్వల్పంగా దగ్దమైంది.
ఇది చూడండి: కారులో చెలరేగిన మంటలు..తప్పిన పెను ప్రమాదం