విశాఖ కంచరపాలెం జాతీయ రహదారిపై ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఓ వైపు వర్షం, మరోవైపు కారులోంచి దట్టమైన పొగలు రావడంతో.. వాహనదారుడు జాతీయ రహదారిపై వాహనాన్ని నిలిపివేశాడు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగడానికి గలా కారణాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు