AP Police Notification Age Limites: తెలుగుదేశం హయాంలో 2018 లో 334 ఎస్సై, 2723 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్సై ఉద్యోగాలకు 21 నుంచి 27 ఏళ్లు , కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 నుంచి 24 ఏళ్లు అర్హత గా నోటిఫికేషన్ లో తెలిపారు. కానీ వయోపరిమితి సడలింపు లేక.. కొందరు రోజులు, నెలల తేడాతో అనర్హులుగా మారారు. మొన్నటి వరకు తమతో కోచింగ్ తీసుకున్న వారు ఇప్పుడు అనర్హులుగా మారారని అభ్యర్ధులు చెబుతున్నారు. ప్రభుత్వం వయోపరిమితి సడలించాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు అగ్నివీరుల ఎంపిక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కూడా రెండేళ్ల వయోపరిమితిని సడలించిందని అభ్యర్ధులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా పోలీసు ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే కేంద్రాలు విజయవాడలో నగరంలో కొన్ని ఉన్నాయి. నాలుగేళ్లుగా నోటిఫికేషన్ రాకపోయినా.. వస్తుందనే నమ్మకంతోనే కోచింగ్ కేంద్రాలను నడుపుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ నోటిఫికేషన్ రాకపోవటంతో మధ్యలోనే చాలామంది వెళ్లిపోయారని అంటున్నారు. కోచింగ్ తీసుకుంటున్న కొందరు వయోపరిమితి కారణంగా అనర్హులుగా మారటం బాధ కలిగిస్తుందని.. ప్రభుత్వం వయోపరిమితి సడలించాలని కోరుతున్నారు. ప్రభుత్వం వయోపరిమితి విషయంలో పునరాలోచించి..సరైన నిర్ణయం తీసుకోవాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: