ETV Bharat / state

Milk Supply: సరఫరా కేంద్రాలకే చేరలేదు.. లబ్ధిదారులకు అందేదెప్పుడు? - విశాఖ జిల్లాలో పాల సరఫరా

విశాఖ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పాల సరఫరా గాడి తప్పింది. నెల మొదటి వారంలో పంపిణీ చేయాల్సిన టెట్రా పాలు.. నెలఖారు వచ్చినా లబ్ధిదారులకు అందలేదు. కనీసం సరఫరా కేంద్రాలకైనా చేరలేదు. నిన్న, మొన్నటి వరకు గుత్తేదారులతో సమస్యలంటూ చెప్పుకొచ్చిన యంత్రాంగం.. ప్రస్తుత జాప్యానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వైఎస్ఆర్ సంపూర్ణ యాప్' కారణమంటూ సమాధానమిస్తున్నారు. పాల సరఫరాలో పారదర్శకత కోసం తీసుకువచ్చినా ఈ యాప్​లో సాంకేతిక సమస్యలున్నాయని.. అందుకే పంపిణీ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు.

Milk Supply in visakhapatnam
Milk Supply in visakhapatnam
author img

By

Published : Aug 29, 2021, 5:00 PM IST

Milk Supply: సరఫరా కేంద్రాలకే చేరలేదు.. లబ్ధిదారులకు అందేదెప్పుడు..!

విశాఖ జిల్లాలో 4952 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటికి నెలకు పన్నెండున్నర లక్షల లీటర్ల టెట్రా పాక్ పాలు సరఫరా చేయాలి. ప్రతి నెలా మొదటి వారం, మూడో వారంలో రెండు ధపాలుగా కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఆగస్టు నెలలో యాభై శాతం కేంద్రాలకు ఒక్కసారి కూడా పాలను పంపలేదు. పన్నెండున్నర లక్షల లీటర్లకుగాను.. ఇప్పటివరకూ నాలుగు లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేయగలిగారు. ఫలితంగా ఈనెలలో పూర్తి స్థాయిలో లబ్ధిదారులు.. అంగన్వాడీ పాలు పొందే అవకాశం కనిపించటం లేదు.

అందుబాటులోకి యాప్.. కానీ..

అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన పాలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఏపీ డెయిరీ డెవలప్​మెంట్ సంస్థ.. జులై నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్​ని ప్రవేశపెట్టింది. ఈ యాప్ ఉద్దేశం మంచిదే అయినా ప్రయోగత్మకంగా అమలు వంటివి చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అమల్లోకి తీసుకువచ్చారు. ఫలితంగా సరఫరాలో అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అంగన్వాడీ సిబ్బంది చెబుతున్నారు. పైగా డెయిరీ నుంచి లబ్ధిదారుల వరకు పాలు చేర్చే క్రమంలో మూడు దశల్లో.. రవాణాదారులు, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. కేంద్రాల వారీగా పాల వివరాలను యాప్​లో నమోదు చేయాలి. దీంతో పాల సరఫరా కంటే.. యాప్​లో వివరాల నమోదుకు సమయం ఎక్కువ పడుతుందని సరఫరాదారులు చెబుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో యాప్​లు ఏ మాత్రం పని చేయడం లేదని పలువురు చెబుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో ఎలా సరఫరా చేయాలనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు బయోమెట్రిక్ వేసేందుకు అవసరమైన పరికరాలు కూడా లేని పరిస్థితులు పలు చోట్ల ఉన్నాయి. ఇప్పటికే పాల సరఫరా ఆలస్యం కావడంతో లబ్ధిదారులకు బయోమెట్రిక్ లేకుండానే పలు చోట్ల పాలు అందిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృషిసారించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా తెదేపా ప్రజాప్రతినిధుల లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.