అందమైన యువతిని ఎరగా వేసి.. యువకులను దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా విశాఖపట్నంలో ఘరానా మోసానికి పాల్పడ్డారు. . 'కాల్ మీ ఎనీటైమ్ మెసేజ్'తో విశాఖలో భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ముఠా ఉచ్చులో చిక్కుకున్న ప్రవీణ్ అనే యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.
ప్రణీత్ నగ్న వీడియోకాల్ రికార్డు చేసిన ముఠా బెదిరింపులకు దిగింది. యువకుడి నుంచి పలుమార్లు రూ.24లక్షలు వసూలు చేశారు. బెదిరింపులు తట్టుకోలేక ప్రణీత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠాకు చెందిన మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.5లక్షలు, ల్యాప్‌టాప్, 8 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్టు క్రైమ్ డీసీపీ సురేశ్‌బాబు తెలిపారు.
ఇదీ చదవండి: