Cake mixing celebrations in Visakhapatnam: విశాఖలో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. సాగరతీరంలోని ప్రముఖ హోటల్ నోవాటెల్‌లో కేక్ మిక్సింగ్ తో క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభించారు. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో పాటు దేశీయ మద్యంతో పాటు విదేశాలకు చెందిన ఖరీదైన వైన్ తో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్ తయారు చేశారు. వరుణ్ గ్రూప్ హోటల్స్‌లో ప్రత్యేక క్రిస్మస్ వేడుకలకు కేక్ మిక్సింగ్ తో ప్రారంభిస్తున్నామని హోటల్ నిర్వాహకులు తెలిపారు డిసెంబర్ రెండో వారం వరకు బాగా నానబెట్టి సోక్ చేసి చివరగా కేక్ తయారీని ప్రారంభిస్తామని హోటల్ చెఫ్ తెలిపారు. విశాఖలోని వరుణ్ గ్రూప్ చెందిన ప్రముఖులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: