శ్రీలంక మీదుగా వచ్చిన 'బురేవి' తుపాను బలహీన పడింది. దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకేలోపే తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది గురువారం రాత్రికి తమిళనాడు మీదుగా కేరళలో శుక్రవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని... భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. తర్వాత ఆరేబియా సముద్రంలో కలుస్తుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఇది బుధవారం రాత్రి శ్రీలంకలోని ట్రింకోమలీ ప్రాంతానికి ఉత్తర భాగానా తీరం దాటుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి