విశాఖ జిల్లా అక్కయ్యపాలెం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆలయంలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. గుడిలో హత్య జరగడం పట్ల పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇంకా గుర్తించలేదు. దీనిపై విచారణ కొనసాగుతుందని విశాఖ తూర్పు ఏసీపీ కులశేఖర్ చెప్పారు.
ఇదీ చదవండి: అమానుషం: తల్లిని హతమార్చిన కుమారుడు.. సహకరించిన భార్య