అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ జిల్లా అరకు లోయ సమీపంలోని బొర్రా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పై కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస- కిరండల్ రైలుమార్గంలోని ట్రాక్ పై బండరాళ్లు పడటంతో ట్రాక్ దెబ్బతింది.
రైల్వే అధికారులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. ట్రాక్ ధ్వంసం కావడంతో ఈ మార్గంలో ప్రయాణించే గూడ్స్ రైళ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. 24 గంటల్లో ట్రాక్ ను పునరుద్ధరించేందుకు అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: