లాక్ డౌన్ ఆరంభం నుంచి మూతబడిన బ్రాండిక్స్ ప్రాంగణంలో అన్ని ఉత్పత్తులు నిలిచిపోయాయి. శ్రీలంకకు చెందిన దాదాపు 120 మంది వరకు ఉద్యోగులు అధికారులు బ్రాండిక్స్ లోనే వసతి గృహాల్లో ఉంటున్నారు. కరోనాతో పోరాడే ఈ క్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి.. పీపీఈలు తయారీ చేయాలని నిర్ణయించారు. రోజుకు కనీసం 1000 సూట్లు తయారీకి.. ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు.
![brandix suits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-02-14-brandix-suits-av-more-3031531_14042020224538_1404f_1586884538_258.jpg)
బ్రాండ్ భారత భాగస్వామి దొరస్వామి ఈ చర్య కోసం చొరవ తీసుకున్నారు. ఫలితంగా ప్రాంగణంలోనే ఉంటున్న శ్రీలంక నుంచి వచ్చిన ఇంజినీర్లు ఇతర అధికారులు బ్రాండిక్స్ లో ఈ సూట్లు తయారీకి ముందుకు వచ్చారు. వారే స్వయంగా వీటిని తయారు చేస్తున్నట్లు భారత భాగస్వామి దొరస్వామి వెల్లడించారు.
ఇదీ చదవండి: